ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు నగరంలోనీ, జిల్లా కోర్టు ఆవరణంలో ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- గంజాయి.నాగముని నీ డోన్ బేతంచర్లకు చెందిన శ్రీవిద్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు మరియు టిడిపి నాయకులు అనిత, విజయలక్ష్మి, మధు కుమార్, అశోక్, నిసార్, విజయ్ కుమార్, బుజ్జి, గోపాల్, సురేంద్ర, అరుణ్, భాష, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు వేసి, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మరియు టిడిపి నాయకులు మాట్లాడుతూ గంజాయి.నాగముని కి కూటమి ప్రభుత్వం ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అయన మరెన్నో గొప్ప,గొప్ప పదవులను చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏపీ ఈడబ్ల్యుఐడిసి రాష్ట్ర డైరెక్టర్- గంజాయి.నాగముని మాట్లాడుతూ సన్మానం చేసిన నాయకులకు, ఎన్జీవోలకు అందరికీ కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
Admin
E Nivas News