Friday, 31 July 2026 10:09:16 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆడబిడ్డ నిధి పథకం వెంటనే అమలు చేయాలి

నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం

Date : 27 April 2026 06:37 AM Views : 139

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం వెంటనే అమలు చేయాలని నందికొట్కూరు నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు టి.షాజహాన్ బేగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు బాగా ప్రచారం చేసిన స్కీం పథకం ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, ప్రతినెల 1500 రూపాయలు ఇస్తామని, సంవత్సరానికి 18 వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని ఆశపెట్టిన ప్రభుత్వం సంవత్సరాలు దాటిపోతున్న ఇంతవరకు ఆచూకీ లేదు బాబు షూరిటీ మహిళల భవిష్యత్తు అవసరానికి అని ఉపయోగించుకున్నారని సూపర్ సిక్స్ పథకాలలో మహిళలపై నాలుగు పథకాలు ఉన్న ఏ ఒక్క పథకం కూడా పూర్తిగా అందించడంలో విఫలమయ్యారని అన్నారు. మహిళలకు అదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ అంటూ చుక్కలు చూపిస్తూ ఆందోళన చెందే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ఆడబిడ్డ నిధి పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకానికి వస్తే మహిళలకు ఉచిత బస్సులను అవమానంగా, హేలనపరిచే విధంగా ఉందని ఎత్తి చూపారు. ప్రతి డిపో బస్సు జిల్లాలలోనీ, అన్ని మండలాలలో స్టేజి ఉన్నచోట ఆపకుండా ఇష్టం వచ్చే చోట ఆపి మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క గ్రామాల్లో అయినా, మండల కేంద్రాల్లో అయినా స్టేజీలు ఉన్నచోట ఆపకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ప్రభుత్వానికి కనబడటం లేదా అని మహిళా కాంగ్రెస్ తరపున ఒక మహిళగా అడుగుతున్నానని చెప్పారు. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు బస్సులు కూడా ఎక్కువగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :