Friday, 31 July 2026 01:19:02 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కబడ్డీ పోటీలలో గెలుపొందిన మొదటి విజేత టీంకు 35వేల రూపాయలు బహుమతి ప్రధానం చేసిన ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్

Date : 26 December 2025 08:50 PM Views : 315

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, చెలిమిళ్ళ గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా సిఎస్ఐ సంఘం ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలను ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మద్దూరు గ్రామంలో షాప్ ను కూడా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా ఆయనకు మెడలో పూలమాలవేసి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ కు ఎద్దుల బండిమీద మేల తాళాలతో ఊరేగింపుతో కార్యక్రమానికి తీసుకొని వెళ్లడం జరిగింది. ఆయన అనంతరం కబడ్డీ టీమ్ సభ్యులను షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ కబడ్డీ పోటీలలో 36 టీములు పాల్గొనగా, అందులో ఫైనల్ గా గెలుపొందిన మొదటి విజేత టీంకు అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ మొదటి బహుమతి నగదు 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గెలుపొందున ఇతర విజేతలకు రెండవ బహుమతి సంఘ పెద్దలు 25వేల రూపాయలు, డి.పెద్ద పుల్లయ్య మూడవ బహుమతి 15వేలు, నాలుగో బహుమతి వి.ప్రాచీస్, నడిపిన నారాయణ-10వేలు, ఐదో బహుమతి గణముల బ్రదర్స్-5 వేలు, ఆరవ బహుమతి సిఎస్ఐ సంఘం-3 వేల రూపాయల ప్రకారము ఇవ్వడం జరిగింది. ఈ పోటీలలో పాల్గొన్న వాళ్ళందరికీ, ప్రజలకు గ్రామ సర్పంచ్ కోట్ల.చద్రారెడ్డి భోజన వసతి సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో పండుగ పూట ఇటువంటి పోటీలు ఏర్పాటు చేయడం వలన అందరికీ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల సైన్యం బిసి ఐక్య సంఘం అధ్యక్షుడు గట్టు.శంకర్ గౌడ్, జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు, ఆర్.ఎల్ల గౌడ్, మింగి.శ్రీనివాసులు, మేకల సుధాకర్ , చాకలి శివుడు, వెంకటేశ్వర్లు గౌడ్, వెంకటరమణ, రాము గౌడ్ వేల్పుల రాజు, కిట్టు, సత్యరాజ్, వినోద్ కుమార్, స్వామిదాసు, అభిమానులు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :