ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా మండలంలోని, తంగేడంచ గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్నీ గ్రామాల్లో పింఛన్లు పండగ వాతావరణం నెలకొందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సామాజిక పింఛన్లు ఒకరోజు ముందుగానే డిసెంబర్-31వ తేదీననే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాది సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయం నుండి సచివాలయ సిబ్బందితో లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, గొల్ల లక్ష్మీదేవికి, గ్రామంలోని లబ్ధిదారులకు ఈశ్వర్ రెడ్డి చేతులమీదుగా పింఛన్లు ఇవ్వడం జరిగింది. పిక్కిలి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఇది ఊరురా పింఛన్ ల పంపిణీ పండుగలా కొనసాగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. తంగేడంచ గ్రామంలోని అవ్వ తాతలను పలకరించి, మీకు ప్రతి అవసరం తీర్చడానికి మన కూటమి ప్రభుత్వం ముందుందని భరోసా ఇచ్చారు. గ్రామంలో పర్యటించి సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ దారులకు నగదు అందజేశారు. అంతేకాకుండా ప్రజలకు పింఛన్ ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు- రూ.4 వేలు, వికలాంగులకు రూ. 6 వేలు ప్రకారం కూటమి ప్రభుత్వం మీ ఇంటిదగ్గరికే వెళ్లి ఇచ్చే విధంగా చేసిందన్నారు. కాబట్టి మీరందరూ తప్పకుండా సచివాలయ సిబ్బందికి సహకరించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం శ్వేత, వెల్ఫేర్ అసిస్టెంట్ సాయి కిరణ్, మహిళా పోలీస్ కారుణ్య, ఫీషరీస్ హనోకు, అగ్రికల్చర్ ప్రసన్న, ఆశ వర్కర్ రాములమ్మ,, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News