Friday, 31 July 2026 03:57:57 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

లాట‌రీ ద్వారా బార్ల కేటాయింపు..! అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌క్రియ‌

క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న‌,

Date : 05 February 2026 04:34 PM Views : 169

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ (2025-28) ప్ర‌కారం జిల్లాలో అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో లాట‌రీ ద్వారా బార్ల కేటాయింపు జ‌రుగుతోంద‌ని ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ టి.శ్రీనివాస‌రావు తెలిపారు. గురువారం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిష‌న్ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని స‌మావేశ మందిరంలో బార్ల కేటాయింపున‌కు లాట‌రీ ప్ర‌క్రియ జ‌రిగింది. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న‌లో ఈ ప్ర‌క్రియ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ టి.శ్రీనివాస‌రావు మాట్లాడుతూ గ‌తంలో మిగిలిపోయిన 55 బార్ల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌గా, తాజాగా 21 బార్ల‌ను లాట‌రీ ద్వారా కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌తో పాటు కొండ‌ప‌ల్లి, తిరువూరు మునిసిపాలిటీల ప‌రిధిలోని ఈ బార్ల‌కు నాలుగు లేదా అంత‌కంటే ఎక్కువ‌గా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న వాటికి దరఖాస్తుదారుల సమక్షంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లాట‌రీ ద్వారా బార్ల‌ను కేటాయించిన‌ట్లు టి.శ్రీనివాస‌రావు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ ఎస్‌.శ్రీనివాస‌రావు, అసిస్టెంట్ ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ ఆర్‌వీ. రామ‌శివ‌, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :