Thursday, 30 July 2026 01:30:34 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై చర్యలు తీసుకోండి

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్

Date : 24 January 2026 09:57 PM Views : 199

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సుధాకర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు పై అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ సుధాకర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు తెచ్చినటువంటి జీవో ను దుర్వినియోగం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రైతులు దగ్గర ఎస్ఆర్ఎంసి తెలుగు గంగపై ఉన్న బిల్లుకు గ్రావిల్ ను టన్నుల ప్రకారం అమ్ముతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని, ఎర్రగూడురు గ్రామ ఆంజనేయస్వామి గుడి దగ్గర చెక్ పోస్ట్ పెట్టి, అలాగే కొత్తమాడుగుల దగ్గర చెక్ పోస్ట్ పెట్టి బిల్లులు కూడా ఇస్తున్నారని ఆయన అన్నారు. వారు తెచ్చినటువంటి జీవో ప్రకారం కేవలం లైసెన్సు క్వారీలో ఉన్న గ్రావెల్స్ కు మరియు ఇసుక కు మాత్రమే బిల్లు ఇవ్వాలి కానీ ఈ సుధాకర ఇన్ఫ్రా కంపెనీ వారు ఒక ట్రాక్టర్ కు 350/- చొప్పున, ఒక ట్రిప్పర్ కు 2250/- చొప్పున వసూలు చేస్తూ రైతులకు, వెంచర్లకు అమ్ముతున్నారని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న జీవోలు, వాటి షరతులు జీవో పరిధిలు చూడకుండా తెలుగు గంగ అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెలుగు గంగ అధికారులపై, అలాగే సంబందిత అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :