Friday, 31 July 2026 06:20:32 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ ఆత్మకూరు, "జాతీయ జెండా దినోత్సవం" అనే అంశాలపై భారీ అవగాహన ర్యాలీ

Date : 22 July 2026 10:35 PM Views : 66

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, పెద్ద కబేలా వీధిలో గల చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో ఎస్ఏఎస్ఏ కార్యక్రమం మరియు జాతీయ జెండా దినోత్సవం సందర్భంగా "స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ ఆత్మకూరు" అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిశుభ్రమైన పరిసరాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ జెండాపై గౌరవ భావం, పౌర బాధ్యతలపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ, ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ సిబ్బంది జీవన్ కుమార్ ఓబులేసు, రఫీక్, రాఘవ మరియు పాఠశాల కరెస్పాండెంట్ తాజుద్దీన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీని అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని, ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన, జాతీయ జెండా గౌరవాన్ని తెలియజేస్తూ నినాదాలు చేశారు. రహదారులపై చెత్త వేయకుండా పరిశుభ్రతను పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం నంద్యాల టర్నింగ్ వద్ద విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి "స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ ఆత్మకూరు" సందేశాన్ని ప్రజలకు బలంగా చాటిచెప్పారు. విద్యార్థుల క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ మానవహారం స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందనీ అన్నారు. ప్రతి విద్యార్థి పరిశుభ్రతకు రాయబారిగా మారి సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో యువత, విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో కీలకం అని అన్నారు. ప్రతి ఇంటి నుంచి పరిశుభ్రత ఉద్యమం ప్రారంభమైతేనే మన ఆత్మకూరు ఆదర్శ పట్టణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ మరియు హెడ్ మాస్టర్ తాజుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక బాధ్యత, దేశభక్తి, పరిశుభ్రత విలువలను పెంపొందించడం మా పాఠశాల లక్ష్యం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంచుతాయని తెలిపారు. ర్యాలీ ముగింపులో అతిథులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 'స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ ఆత్మకూరు లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ అవగాహన ర్యాలీ పట్టణ ప్రజల్లో విశేష స్పందనను పొందడమే కాకుండా పరిశుభ్రత, దేశభక్తి, సామాజిక బాధ్యతలపై చైతన్యాన్ని పెంపొందించింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :