ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల నూతన ఎస్సై- పి.తిరుపాలు కు వేంపెంట గ్రామ సర్పంచ్- వై.మాణిక్యమ్మ, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య, సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి లు శాలువాలు కప్పి, తీపి గుర్తులుగా స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య లు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం-2026 లో, మన మండల ఎస్సై- పి.తిరుపాలు పర్యవేక్షణలో మండల ప్రజలందరూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా, వర్గ బేధాలకు పోకుండా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి పౌరులుగా రాజకీయాలకు అతీతంగా, కుల మతాల అతీతంగా స్నేహపూర్వకంగా మానవత్వంతో, సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి జీవించాలని, అన్ని పండుగలు కూడా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆనందంగా జరుపుకోవాలని, అందులో మేమందరం కూడా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
E Nivas News