Friday, 31 July 2026 10:46:52 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గడివేముల బాలుర వసతి గృహంలో కూరగాయలు, నిత్యవసర వస్తువులు సరిగ్గా లేవు

డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు

Date : 16 December 2025 07:53 PM Views : 219

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ గడివేముల : గడివేముల బాలుర వసతి గృహంలో కూరగాయలు, నిత్యవసర వస్తువులు సరిగ్గా లేవని వెంటనే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గడివేముల మండల కేంద్రంలోని, ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడుతూ హాస్టల్ నందు 150 మంది బాలురు ఉంటే, ప్రస్తుతం 120 మంది హాజరుగా ఉన్నారని తెలిపారు. హాస్టల్లో కూరగాయలు తాజా కూరగాయలు తేకుండా, ఐదు రోజులకోసారి కూరగాయలు తెస్తున్నందున, ఆ కూరగాయలు కొన్ని మురిగిపోయి సరిగ్గా లేవని వాటిని పిల్లలకు వండి పెడుతున్నారని ఇది ఎంత అన్యాయమని అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు హాస్టల్ వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. హాస్టల్ నందు మురళి రెడ్డి అనే ఉద్యోగి హాస్టల్ కు రాకుండా ఒక మహిళను కూలీగా పెట్టి సంవత్సరం నుండి హాస్టల్ కు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు తాజా కూరగాయలతో మంచి భోజనం పెట్టడం లేదని లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రగ్గులు కూడా ఒక్కొక్క విద్యార్థికి ఒకటే ఇచ్చారని ఈ మధ్యకాలంలో చలి ఎక్కువైందని పిల్లలకు ఇంకొక బెడ్ షీట్ ఇవ్వాలని ఆయన అన్నారు. పై విషయాలపై జిల్లా కలెక్టర్ కి తెలియజేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :