Friday, 31 July 2026 07:23:59 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మానవ హక్కుల పరిరక్షణ కొరకు కృషిచేసినందుకు ఏపీ గౌరవ అవార్డు అందుకున్న సమాజ సేవకురాలు సయ్యద్ మెహతాజ్ బేగం

Date : 09 February 2026 04:49 PM Views : 244

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య జిల్లా/ రైల్వే కోడూరు : ఫిబ్రవరి 8వ తేదీన కడప నగరంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గౌరవ అవార్డ్స్– 2026 ల ప్రధానం కార్యక్రమంలో తిరుపతి జిల్లాకు గర్వకారణంగా నిలిచే విధంగా, సామాజిక న్యాయం మరియు మానవ హక్కుల పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సయ్యద్ మెహతాజ్ బేగం ప్రతిష్టాత్మక “ఏపీ గౌరవ అవార్డు” అందుకున్నారు. సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, మహిళల హక్కుల పరిరక్షణ, పేద మరియు బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించడం వంటి అంశాలలో ఆమె చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అందజేసింది. అనేక సంవత్సరాలుగా మానవ హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ, అన్యాయానికి గురైన వారికి ధైర్యంగా నిలబడుతూ, న్యాయం కోసం పోరాడిన ఆమె సేవలు ప్రజల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ పురస్కారాన్ని వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారీ స్వయంగా ప్రదానం చేయడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సయ్యద్ మెహతాజ్ బేగం సేవలు కేవలం ఒక ప్రాంతానికే కాకుండా రాష్ట్ర స్థాయిలో అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. ఆమె చేసిన సేవా కార్యక్రమాలు మానవ హక్కుల రంగంలో ఒక ఆదర్శంగా నిలుస్తాయని ప్రశంసించారు. ఈ అవార్డు అందుకోవడం తనకు మరింత బాధ్యతను పెంచిందని మెహతాజ్ బేగం ఈ సందర్భంగా తెలిపారు. తనను ఈ గౌరవానికి నామినేట్ చేసిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ కి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన సేవా కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు – మహిళా విభాగంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సయ్యద్ మెహతాజ్ బేగం భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఈ అవార్డు ఆమె సేవలకు లభించిన గౌరవంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా మానవ హక్కుల ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చిన ఘనతగా నిలిచింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: