ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు గ్రంథాలయం శాఖ కార్యాలయంలో, గ్రంథాలయ అధికారి-సి.వి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం కార్యక్రమం పురస్కరించుకుని ఈరోజు బాలల దినోత్సవం & భారతదేశపు తొలి ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి- ఇ.వి.నాగలక్ష్మి దేవి పూలమాలవేసి, నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారిణి ఈ.వి. నాగలక్ష్మిదేవి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ స్కూల్ ఇన్చార్జి హెచ్.ఎం- నిజాముద్దీన్, ఆయుర్వేద వైద్యురాలు- డి.సావిత్రి మరియు పాఠకులు రవి, పరమేష్ ,వీరన్న మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనడం జరిగిందని గ్రంథాలయాధికారి సి. వి.కృష్ణారెడ్డి తెలిపారు.
Admin
E Nivas News