ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మద్దూరు పంచాయతీ ఎస్టీ కాలనీలో ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియ చాలా వేగవంతంగా చేయడం జరిగింది, ఉదయం 7 గంటల నుంచి ఇంటి ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరి వారి అప్లికేషన్లు రాసి, తగిన ప్రక్రియ పూర్తి చేసి అప్లికేషన్లు అందజేయడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓ శంకర్ గౌడ్ చదువు రానిది వారికి కూడా వివరిస్తూ, వారి అప్లికేషన్లు ఫిలప్ చేస్తూ రాత్రి పది గంటల వరకు సేవలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 202 బూత్ బిఎల్ఎ వైఎస్ఆర్సిపి నాయకులు రాములు నాయక్, ఎస్టీ కాలనీవాసులు పాల్గొన్నారు.
Admin
E Nivas News