ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలం ప్రజాపరిషత్ కార్యాలయం మీటింగ్ హర్ నందు బాల బాలికలపై లైంగిక వేధింపుల నివారణపై అవగాహన సదస్సు. కార్యక్రమంను డాక్టర్ శరత్ ఎండి మానసిక ఆరోగ్య నిపుణులు. పుష్ప నంద కుమారి చిన్నపిల్లల మానసిక నిపుణురాలు, పి నాగేంద్రుడు ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి, వెంకటరామిరెడ్డి సోషల్ వర్కర్, యు.సురేఖ జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, ఎం. అయూబ్ అహ్మద్ ఆత్మకూరు మండలం విద్యాశాఖ అధికారి, కల్లూరి పెద్ద మస్తానయ్య సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ టిబి యూనిట్ ఆత్మకూరు నిర్వహించడం జరిగినది డాక్టర్ శరత్ ఎండి మానసిక ఆరోగ్య నిపుణులు బాలికలు ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి అవుతారు వారి యొక్క మానసిక జీవన విధానాన్ని గమనించిన వారు ప్రత్యేకంగా ఉంటారు. పుష్పానందకుమారి చిన్నపిల్లల మానసిక నిపుణులు గారు బాలురు వారు ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు ఆ విధంగా గురైన వారు వారి జీవనశైలిలో పెను మార్పులు ఉంటాయని తెలియజేసినారు. ఆత్మకూరు మండలం విద్య శాఖ అధికారి బాల బాలికలను లైంగిక వేధింపులకు గురికాకుండా చూసుకోవలసిన బాధ్యత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉందని తెలియజేసినారు. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, బాల బాలికల లైంగిక వేధింపులకు గురికాకుండా నివారించుటలో తల్లితండ్రులు, అన్ని రకాల డిపార్ట్మెంట్ అధికారులు, చట్టపరంగాను న్యాయ పరంగాను కాపాడుటకు పోలీస్ అధికారులు మరియు న్యాయాధిపతుల కృషి వలన చాలా తగ్గుముఖం పట్టవచ్చును అని అన్నారు. ఈ కార్యక్రమం నందు డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఆరోగ్య కార్యకర్త సుబ్బలక్ష్మి, శ్రీధర్ ప్రగతి హైస్కూల్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పాములపాడు, కొత్తపల్లి హెల్త్ వెల్నెస్ సెంటర్. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, వార్డు హెల్త్ సెక్రటరీలు, అంగన్వాడి టీచర్లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అదేవిధంగా డాక్టర్ పవన్ కుమార్ మెడికల్ ఆఫీసర్ బైర్లూటి వారి ఆధ్వర్యంలో స్పెర్స్ అవగాహన మరియు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము సందర్భంగా క్యాన్సర్ పై అవగాహన ర్యాలీని ఎంపీడీవో కార్యాలయం నుండి గౌడ్ సెంటర్ వరకు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు సుబ్బలక్ష్మి, మల్లీశ్వరి వార్డ్ హెల్త్ సెక్రెటరీ ప్రశాంతి, గవర్నమెంట్ హైస్కూల్ ఇన్చార్జి హెడ్మాస్టర్ మురళీకృష్ణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News