ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నంద్యాల జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్-2026 లను జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు, మండల నాయకులు సి.ధర్మయ్య, జె.మద్దిలేటి, శ్రీశైలం రజక సత్రం కమిటీ మెంబర్ కడుమూరీ.గోపాల్, రమేష్, లింగస్వామి, మధు, పుల్లయ్య, నాగన్న, తిక్కస్వామి, మహేష్, కళ్యాణ్, చిన్న లింగస్వామి, నారాయణ, చిన్న రామకృష్ణ, తదితరులతో కలిసి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రజక వృత్తిదారుల సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం-2026 అందరికీ మంచి జరగాలని, అందరూ అభివృద్ధి పథంలో సుఖ సంతోషాలతో జీవించాలని, అందులో నేనుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ అందరికీ పేరుపేరునా నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
E Nivas News