Friday, 31 July 2026 04:58:45 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నందికొట్కూరు నియోజకవర్గ పి4 కార్యాలయాన్ని ప్రారంభించిన నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 18 December 2025 06:13 PM Views : 286

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలో నియోజకవర్గానికి సంబంధించి పి4 ఎమ్మెల్యే కార్యాలయాన్ని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లు అధికారులు, నాయకులతో కలసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి” గొప్ప సంకల్పంతో, పేదరికంలేని స్వర్ణాంధ్ర కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఆదర్శంగా తీసుకొని, మీరు కూడా ఈ రోజే పి4 లో భాగస్వాములై, అందరికీ మార్గదర్శిగా ముందుకొచ్చి సమాజంలోని బంగారు కుటుంబాలకు మీ వంతు సహాయం చేయండని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు, అవసరమైన మౌలిక సౌకర్యాలు, మరియు ఆర్థిక మద్దతు అందిస్తూ, వారి జీవితాలలో మార్పు తీసుకురావడానికి పి4 కృషి చేస్తోందని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, పాములపాడు మండల తెలుగు యువత అధ్యక్షుడు షేక్.కరీం బాష, రెండో వార్డ్ కౌన్సిలర్ మొల్ల.జాకీర్ హుసేన్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, బిజెపి నాయకుడు చల్లా దామోదర్ రెడ్డి, జనసేన నాయకుడు నల్లమల.రవికుమార్, మున్సిపల్ కమిషనర్- ఎస్.బేబీ, పాములపాడు ఎంపీడీవో ఎన్. చంద్రశేఖర్, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, లాయర్ సురేష్, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :