Friday, 31 July 2026 07:24:22 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పాములపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 05 December 2025 10:42 PM Views : 279

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ యం- శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా నందికొట్కూరు నియోజవర్గం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త. జయసూర్య మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేటు విద్యాసంస్థలకు అనుగుణంగా అభివృద్ధి చెందాయన్నారు. అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ విద్యాబోధన చేస్తారన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు వేయాలన్నారు. ప్రతి ఒక్కరు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు.మీరు బాగా చదువుకోవడం వల్ల మన స్కూల్ కి, మన ఊరికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. అంతేకాకుండా మన భారత దేశానికి బాలికల క్రీకెట్ జట్లు విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాబట్టి వీరికోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పథకమని అన్నారు. ప్రతి ఒక్క తల్లితండ్రులు విద్యార్థులను స్కూల్ కి పంపించాలనీ, బాగా చదువుకోనీ ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాసేలా మూల్యాంకన పుస్తకాలను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయా అంటూ ఎమ్మెల్యే తల్లిదండ్రులను అడగడం జరిగింది. తల్లిదండ్రులుగా మీరు ప్రతి సారి మీటింగ్ లకు వచ్చారా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు చదువు బాగా చెప్తున్నారా ?, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల లోనే తమ పిల్లలను చేర్పించి, మన బడిని కాపాడాలని కోరారు. అనంతరం విద్యార్థులందరికీ మధ్యాహ్నం భోజననంను ఎమ్మెల్యే గిత్త.జయసూర్య వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ- యన్.చంద్రశేఖర్, ఎస్ఐ- కె.సురేష్ బాబు, ఎంఈఓ- బాలాజీ నాయక్, పాములపాడు సొసైటీ ఛైర్మన్ సి.గోవిందు, మద్దూరు సొసైటీ ఛైర్మన్, వాడాల జనార్ధన్ రెడ్డి, డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు చెల్లె.హరినాథరెడ్డి, బండ్లమూరీ. వెంకటేశ్వరావు, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామ సుబ్బమ్మ, టిడిపి నాయకులు బోనపల్లె.వినయ్, జిల్లా పరిషత్ హైస్కూల్ డ్రిల్లు మాస్టర్ పిడి- రాజశేఖర్, ఉపాధ్యాయులు ద్రాక్షాయిని బాయి , దామరేకుల.రవి, విజయలక్ష్మి, రాంప్రసాద్, సాయిరాం, నాయుడు, తదితర ఉపాధ్యాయులు, భవిత పాఠశాల ఉపాధ్యాయులు శంషుద్దీన్ , రామ్మూర్తి, హెల్త్ సిబ్బంది సి హెచ్ ఓ- జి.అన్నమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున, బి.మాధవి, ఆశ వర్కర్లు దేవమణి, వెంగమ్మ,మరియు మండల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :