Saturday, 25 April 2026 10:53:08 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి

Date : 22 April 2026 10:31 PM Views : 53

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల పట్టణంలోని, ఎంపీ కార్యాలయంలో మే 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్ లను నంద్యాల ఎంపీ- డాక్టర్ బైరెడ్డి శబరి నాయకులు ఎనముల.రాజకుమార్, వేల్పుల విజయ్ కుమార్, కె.విశ్వనాథ్ బండి దేవాంతకుడు, విజయ్, తదితరులతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మే-9వ తేదీ జరిగే దళిత క్రైస్తవులు గర్జన, ఎస్పీజీ గ్రౌండ్ రైడర్ మెమోరియల్ హాల్ నందు నిర్వహించబోయే దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్ ను విడుదల చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల మతస్వేచ్ఛ విషయంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, క్రైస్తవ మతపెద్దలు హాజరవుతున్నట్లు నిర్వాహకులు ఏనముల.రాజ్ కుమార్, వేల్పుల విజయ్ కుమార్, కేడెము విశ్వనాధ్, బండి దేవాంతకుడు, తదితర నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి, కర్నూలు ఎంపీ- బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర మంత్రులు బీసీ.జనార్ధన్ రెడ్డి, ఎన్ఎండీ. ఫరూఖ్, టీజీ.భరత్, పద్మశ్రీ మందకృష్ణమాదిగ, తెలంగాణ ఎమ్మెల్సీ, విప్ అద్దంకి దయాకర్, క్రైస్తవ మత పెద్దలు కర్నూలు డయాసిస్ బిషప్(ఆర్సీఎం) గోరంట్ల జ్వాన్నేష్, సీఎస్ఐ నంద్యాల డయాసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి,‌ మాజీ ఎంపీ- జీవీ.హర్షకుమార్, నందికొట్కూరు మాజీ శాసనసభ్యులు తోగూరు.ఆర్థర్, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ & న్యాయవాది జీ.నాగముని, ఏబీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.జయకాంత్ క్రిస్టియన్, క్రిస్టియన్ జేఏసీ ప్రధాన కార్యదర్శి మన్నెం జానయ్య, జాతీయ దళిత క్రిస్టియన్ నాయకులు నీలం సామేలు మోజెస్ తదితరులు హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో దళిత క్రైస్తవులు హాజరవుతున్నారని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :