ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : రోడ్డుపై అడ్డంగా ఉన్న పైపులైన్ గుంతను తొందరగా పూడ్చాలని డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ నాగరాజు మాట్లాడుతూ బానకచర్ల -వేంపెంట గ్రామాల మధ్యలో నున్న రోడ్డుకు అడ్డంగా ఉన్న గుంతను పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎన్నోసార్లు ఎంపీడీవో పంచాయతీరాజ్ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారని ఒకరి డిపార్ట్మెంట్ పై మరొకరు చెప్పుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఎంతోమంది ప్రజలకు కాళ్లు చేతులు విరిగిన సందర్భాలు ఉన్నాయని ఒకరిద్దరూ ఆ గుంతను దాటే సమయంలో ప్రాణాలు కోల్పోయిన సందర్బలు ఉన్నాయని ఇంత జరుగుతున్నా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని తొందరగా గుంతను పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు, స్థానిక శాసనసభ్యులు గిత్త.జయ సూర్య లకు ఫిర్యాదు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా చూస్తానని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్య పోగు ప్రసాదు, శివ గ్రామస్తులు రామన్న, సోమన్న ఇమ్మానియేలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News