ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ లో భాగంగా క్యారమ్స్ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- గంజాయి.నాగముని పాల్గొని, ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ యువత స్పోర్ట్స్ లో చదువుతోపాటు, క్రీడలలో కూడా ముందు ఉండాలని మన కూటమి ప్రభుత్వం యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సెక్రెటరీ సుధాకర్ మరియు న్యాయవాదులు రవికుమార్, రాము, దానా రెడ్డి, రాజేష్ కుమార్, మరి కొంతమంది న్యాయవాదులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News