Friday, 31 July 2026 10:36:57 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టండి..! వేస‌వి స‌న్న‌ద్ధ‌త ప‌క‌డ్బందీగా ఉండాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 24 February 2026 08:32 PM Views : 175

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : జ‌ల్ జీవ‌న్ మిష‌న్ (జేజేఎం) ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టి త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా చూసి ప‌థ‌కం ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జిల్లా జ‌ల‌, పారిశుద్ధ్య మిషన్ (డీడ‌బ్ల్యూఎస్ఎం) స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ - కుళాయి క‌నెక్ష‌న్లలో పురోగ‌తితో పాటు ప‌థ‌కం ప‌నితీరుపై స‌మీక్షించారు. అదేవిధంగా స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ (గ్రామీణ్‌)- ఓడీఎఫ్ ప్ల‌స్‌, ఘ‌న ద్ర‌వ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా త‌దిత‌రాల‌పై చ‌ర్చించారు. ఎ.కొండూరులో మండ‌లంలోని సీకేడీ ప్ర‌భావిత ప్రాంతాల్లో ఇంటి కుళాయి క‌నెక్ష‌న్ల భౌతిక స్థితిని ప‌రిశీలించి నివేదిక స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. 100 శాతం క‌నెక్ష‌న్లు క‌ల్పించేందుకు డీపీవోకు ఆదేశాలిచ్చారు. గొల్ల‌మండ‌ల తండా, జ‌మ‌ల‌గ‌డ్డ‌, దీప్లాన‌గ‌ర్ ఆవాసాల‌కు అవ‌స‌ర‌మైన క్లియ‌ర్ వాట‌ర్ సంప్ నిర్మాణం పూర్తిచేసి మార్చి నాటికి తాగునీటి స‌దుపాయం క‌ల్పించాల‌న్నారు. వేస‌విలో ఎక్క‌డా తాగునీటికి కొర‌త లేకుండా ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేసేందుకు సిద్ధంగా ఉండాల‌న్నారు. నిరంత‌ర నాణ్య‌మైన తాగునీటి స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌న్నారు. షెడ్యూల్ ప్ర‌కారం చేతి పంపులు, బోర్‌వెల్స్ మ‌ర‌మ్మ‌తులు, పైపులైన్ల లీకేజీల నివార‌ణ‌, క‌లుషిత నివార‌ణ వంటి వాటి ప‌నులు జ‌రిగేలా చూడాల‌న్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా & శిశు సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో తాగునీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లో ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌ని ఆదేశించారు. స్వ‌ర్ణాంధ్ర- 2047 ల‌క్ష్యాల సాధ‌న‌లో స్వ‌చ్ఛ‌మైన తాగునీటి స‌ర‌ఫ‌రా కూడా కీల‌క అంశ‌మ‌ని.. ఈ నేప‌థ్యంలో నీటి నాణ్య‌త ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ప‌క‌డ్బందీగా అమ‌లుచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నిర్దిష్ట కాల‌ప‌రిమితుల్లో నీటి వ‌న‌రుల శాంపిళ్ల‌ను ప‌రీక్షించి, ఫ‌లితాల‌ను ఆన్‌లైన్లో న‌మోదు చేయాల‌న్నారు. పీహెచ్‌, టీడీఎస్‌, హార్డ్‌నెస్‌, ఫ్లోరైడ్‌, ఐర‌న్‌, నైట్రేట్ వంటి వాటితో పాటు భౌతిక‌, ర‌సాయ‌న‌, బ్యాక్టీరియాల‌జిక‌ల్ ప‌రామితుల‌పై దృష్టిసారించాల‌న్నారు. క్లోరినేష‌న్‌తో పాటు పాఠ‌శాల‌లు, అంగ‌న్వాడీలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, హాస్ట‌ళ్లు వంటి వాటిలో ట్యాంకుల శుద్ధి స‌రైన విధంగా జ‌రిగేలా స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. ఈ సమావేశంలో జెడ్‌పీ సీఈవో కె.క‌న్న‌మ‌నాయుడు, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ ఎ.రామ‌కృష్ణారావు, డీపీవో పి.లావ‌ణ్య‌కుమారి, డ్వామా పీడీ ఎ.రాము, వ్య‌వ‌సాయ అధికారి డీఎంఎఫ్ విజ‌య‌కుమారి, విద్య‌, వైద్యం, ఐసీడీఎస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :