ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : నీతి, నిజాయితీ గల నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ తొలి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. కర్నూలు జిల్లా చెక్పోస్ట్ నందు దామోదరం సంజీవయ్య విగ్రహానికి నందికొట్కూరు నియోజకవర్గంమహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా టీ.షాజహాన్ బేగం మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య పేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప ఆదర్శమూర్తి అని డబ్బుతోనే కాదు పేదరికం కృషి పట్టుదల చదువు ఉంటే ఎంతస్థాయికైనా ఎదగలం అనే ఆదర్శంగా నిలిచిన గొప్ప మహనీయుడు దామోదరం సంజీవయ్య అని అన్నారు. దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాలోని, పెద్దపాడులో పుట్టి పెరిగిన ఆయన బాల్యం ఆయన మాతృమూర్తి అయిన సుంకులమ్మ పుట్టినిల్లు అయిన కోడుమూరు మండలంలోని, పాలకుర్తి గ్రామంలో కొనసాగిందని నేను కూడా పాలకుర్తి గ్రామంలో పుట్టి పెరగడం చదువుకోవడం ఎంతో గర్వకారణం అని ప్రతి ఒక్కరూ ఆ గ్రామంలో దామోదరం సంజీవయ్య ని ఆదర్శంగా తీసుకుని చదువు ఉద్యోగాలలో పోటీ తత్వం సాధించారని కొని యాడారు. ప్రతి ఒక్క విద్యార్థి దామోదరం సంజీవయ్య యొక్క స్ఫూర్తి ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టడానికి అందరూ కృషి చెయ్యాలని కోరారు.
Admin
E Nivas News