ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, కరివేన జిల్లా పరిషత్ హైస్కూల్ ను జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ ఎల్.నాగరాజు మాట్లాడుతూ పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కూరగాయలు ఎప్పటికప్పుడు తాజాగా తెచ్చి కూరలు ఉండాలని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం చదువుకు ఎంతో ప్రాధాన్య ఇస్తూ సన్న బియ్యం ఇస్తుందని కనుక ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పౌష్టికాహారం అందించాలని వంట మనసులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఆయన హెచ్చరించారు. వంటగది శుభ్రంగా ఉంచుకోవాలని ఇప్పటివరకు అన్నం, సాంబార్ బాగున్నాయని ఇలాగే శుభ్రంగా వండి పిల్లలకు పెట్టాలని అన్నారు.
Admin
E Nivas News