Friday, 17 April 2026 03:47:56 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన

Date : 15 April 2026 11:25 PM Views : 32

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎండల్లో బయటకు రావొద్దని ప్రజలకు తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావొద్దని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. బయటకు వస్తే టోపీ, తలపాగా తప్పనిసరిగా ధరించాలని దిశానిర్దేశం చేశారు. ఎండదెబ్బ ప్రమాదమని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. అధికారులు గ్రామాలు, పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ స్థాయిలో తాగునీటి సౌకర్యాలను కల్పించాలనిఅధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యేక సూచనలు చేశారు. పనిస్థలాల్లో తాగునీటి వసతి ఏర్పాటు తప్పనిసరని తెలిపారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పని చేసే ప్రాంతాల్లో ఆయా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కార్మికుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :