Friday, 31 July 2026 02:13:48 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆర్టికల్ 14 కు వాలిడేషన్ 2025 పూర్తిగా వ్యతిరేకం...

విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజమల్లయ్య..

Date : 25 March 2026 10:04 PM Views : 140

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆర్టికల్ 14 కు వాలిడేషన్ ఆక్ట్2025 పూర్తిగా వ్యతిరేకంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు నేరెళ్ల రాజ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పని మధుసూదన్ కోరారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాలిడేషన్ యాక్ట్ 2025 విశ్రాంత ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఈ చట్టం వలన 2026, జనవరికి ముందు రిటైర్ అయినా వారికి పెన్షన్ లో ఎలాంటి పెరుగుదల ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026, జనవరి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారికి మాత్రమే పీ ఆర్ సీ, డీ ఆర్ లతో పాటు ఇతర బెనిఫిట్స్ వర్తిస్తాయనడం అన్యాయమన్నారు. ఈ చట్టం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ -14 కు పూర్తి వ్యతిరేకమని తెలిపారు.చట్టం ముందు అందరూ సమానులే అని స్పష్టంగా ఉన్నప్పటికీ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెరుగుదల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి శోచనీయమన్నారు. 1979 లో రిటైర్డ్ ఎంప్లాయిస్ పెన్షన్స్ పెరుగుదలకు వ్యతిరేకంగా వచ్చిన ఆదేశాలపై డీ ఎస్ నాకర ఆధ్వర్యంలో భారత అత్యున్నత న్యాయస్థానంను ఆశ్రయించగా, అప్పటి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తో కూడిన 5 గురు సభ్యుల బెంచ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు పెన్షన్స్ లో ఎలాంటి వివక్షత చూపరాదని, చట్టం ముందు అందరూ సమానం కాబట్టి పెన్షనర్స్ కు కాలనుగుణంగా పెరుగుదల ఉండాలని తీర్పునిచ్చిందన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ సేవలకు చెల్లించే మూల్యంపైన కేంద్ర ప్రభుత్వం వివక్షతను విడనాడాలని వెంటనే వాలిడేషన్ యాక్ట్ 2025 ను ఉపసంహారించాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ అనేది ఎవరి దయ,దాక్షిణ్యల మీద ఇచ్చేది కాదని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైన తమ వైఖరి మార్చుకుని పెన్షనర్స్ కు న్యాయం చేయాలని కోరారు. లేనిచో రాష్ట్ర కమిటీ ఆదేశాలతో మరిన్ని నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఎన్నో ఏండ్లు ప్రభుత్వానికి అనేక రకాలుగా సేవలు అందిస్తే, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయిస్ కు అన్యాయం చేయడం కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. అంతకుముందు తహసీల్దార్ దిలీప్ కుమార్ కు పెన్షనర్స్ సమస్య పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో లక్షేట్టిపేట యూనిట్ అధ్యక్షులు నేరెళ్ల రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పని మధుసూదన్, కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు జంగం ఆశయ్య, ఉపాధ్యక్షులు దేవేంద్ర విజయుడు, అమీర్ సుల్తాన, జాయింట్ సెక్రటరీ కొట్టె రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నం సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి కొండపర్తి సత్యనారాయణ, సభ్యులు సత్యనారాయణ,పెట్టెం మల్లయ్య, గడ్డం లింగయ్య, కోడి సంపూర్ణ, నూతి శంకరయ్య, మేడి బాలరాజు,వొజ్జల మనోహర్, ప్రతాప్, వేల్పుల లింగం ( సాగర్ ) తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: