Friday, 31 July 2026 01:20:16 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు...

కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలకు కేబినెట్ ఆమోదం...

Date : 24 February 2026 07:02 PM Views : 300

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి కోసం రెండు కీలకమైన సంక్షేమ పథకాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం, ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకువెల్లడించారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న పథకం ప్రకారం, 60 ఏళ్లలోపు సర్వీసులో ఉన్న ఉద్యోగి సహజంగా మరణిస్తే, వారికి అందే రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు అదనంగా రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అందించనున్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయలకు పైగా పరిహారం ఇచ్చేలా మరో పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ బీమా పథకాలకు ఉద్యోగుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.దీంతో పాటు, ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన క్యాష్‌లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌ ( ఈ హెచ్ ఎస్ )కు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీని కింద ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 17 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 1.5 శాతం చెల్లించనుండగా, అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈ నిధులతో ఏర్పాటు చేసే ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని 652 ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందిస్తారు. లబ్ధిదారులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయాలతో సుమారు 7.56 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :