ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు, బిసి కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ సావిత్రి బాయ్ పూలే స్పూర్తితో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రీ బాయి పూలే ఒకరన్నారు. సావిత్రిబాయి పూలే దేశంలో తొలి అధర్శ ఉపాధ్యాయురాలు అని విద్య, సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు సావిత్రీ బాయిని కదిలించాయన్నారు. అవమానాలను సైతం లెక్కచేయకుండా కులవ్యవస్థ నిర్ములకు కోసం పాటుపడడంతోపాటు వితంతువులకు, వృద్దులకు, ఒంటరి మహిళలకు చదువు అవసరమని చదువుతోనే సమాజంలో మహిళలకు గౌరవం,గుర్తింపు ఉంటుందని, పాఠశాలలు ప్రారంభించి అన్ని తరగతుల వర్గాల మహిళలకు సమానంగా విద్యను అందించిన మహనీయురాలు అన్నారు. నేటి సమాజంలోనే మహిళలు సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలన్నారు. తన జీవితాన్ని త్యాగం చేసి విధ్యాబోధనకు,బాలికలకు అంకితం చేసిన గొప్ప మహనీయురాలు, సంఘసంస్కర్త సావిత్రి బాయ్ పూలే అన్నారు. ఈ కార్యక్రమంలోవిద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News