Thursday, 30 July 2026 10:15:05 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచేందుకు అవిశ్రాంత పోరాటం

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 05 January 2026 05:19 PM Views : 202

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో సోమవారం సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీని కార్మికులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూసింగరేణి సంస్థను ఒకప్పుడు కాకా వెంకటస్వామి పునఃరక్షించిన విధానమే తనకు స్ఫూర్తిగా మారిందని పేర్కొన్నారు. రిటైర్డ్ సింగరేణికార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, ప్రస్తుతం అందుతున్న అరకొర పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌ను రూ.10,000లకు పెంచాలనే డిమాండ్‌ను పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు. ఈ అంశంపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ, తప్పకుండా సాధించి తీరుతానని రిటైర్డ్ కార్మికులకు హామీ ఇచ్చారు. అలాగే సింగరేణి పారిశ్రామిక ప్రాంతాలైన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి ద్వారా కార్మికుల ప్రయాణాలు సులభతరం చేయాలనే లక్ష్యంతో చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గడచిన పార్లమెంటు సమావేశాల్లో రూ.100 కోట్లతో ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు. ప్రాంత అభివృద్ధిలో భాగంగా చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యత కలిగిన రామగిరి ఖిల్లా అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు కావడం ఆనందకర విషయం అని తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.1.5 కోట్లను అటవీ శాఖకు ఖిల్లా అభివృద్ధి పనుల కోసం అందజేశామని వివరించారు. రానున్న రోజుల్లో రామగిరి ఖిల్లాను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, ప్రాంతానికి ఆదాయ వనరులు పెంచడమే లక్ష్యమని అన్నారు. కాకా వెంకటస్వామి, అలాగే ఎంపీగా వివేక్ సింగరేణి కార్మికుల ఆశీస్సులతో వారి సంక్షేమానికి చేసిన సేవలను స్మరిస్తూ, అదే బాటలో తాను కూడా మీ అందరి ఆశీస్సులతో కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. రిటైర్డ్ కార్మికుల గౌరవం, భద్రత, సంక్షేమమే తన రాజకీయ జీవిత లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :