Friday, 31 July 2026 01:51:57 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ భవిష్యతైన యువతను కోల్పోతున్నాం...

వరంగల్ సిపి. సన్‌ప్రీత్ సింగ్

Date : 23 February 2026 06:24 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రోడ్డు నిబంధనలు పాటించకుండపోవడంతో ఎంతో మంది దేశ భవిష్యతైన యువతను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వల మేరకు ప్రతి నెల చివరి వారం నిర్వహించే “ అరైవ్ అలైవ్ ” రెండవ విడత కార్యక్రమములో భాగంగా సోమవారం వరంగల్ ట్రాఫిక్ అధ్వర్యంలో హన్మకొండలోని వాగ్డేవి కళాశాల విధ్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “ అరైవ్ అలైవ్ ” ఏర్పాటు చేశారు. ముందుగా ఈ కార్యక్రమములో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విధ్యార్థులకు ప్రతి వాహనదారుడు పాటించాల్సిన ట్రాఫిక్ నిబందనలు, వాటిని అతి క్రమిస్తే జరిగే పరిణాలపై ట్రాఫిక్ అధికారులువిద్యార్థులకు వివరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ సిపి. సన్ ప్రీత్ సింగ్ విధ్యార్థులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకుంటూ వాహనం నడపాలని,ఇదే వాహనదారుడు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వాహనదారుడిపై వుందని.వాహనదారుడు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపటం ద్వారా ప్రమాదాలకు గురైయ్యే అవకాశాలు ఎక్కువని, తన థ్రిల్ కోసం వాహనదారుడు వాహనం నడపటం చాలా ప్రమాదకమని, కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని. ఇలాంటి చర్యల కారణంగా కుటుంబ సభ్యులు ఎంతో నష్టాపోతారని, కావున ప్రతి వాహనదారుడు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ డిఫెన్సీ డ్రైవింగ్ చేయాలని సిపి విద్యార్థులకు సూచించారు. గత సంవత్సరంలో హత్యలు లేదా ఇతర కారణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏనిమిది వందల మంది మరణించారు. కాని రోడ్డు ప్రమాదాల కారణంగా గతే ఏడాది 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడటం చాలా బాధకరమని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్రాఫి¾క్ రూల్స్ పాటిస్తూ వాహనం నడపాల్సిందిగా తెలియజేయాలని పోలీస్ కమిషనర్ విద్యార్థులకుసూచించారు.అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డిసిపి ప్రభాకర్ రావు, ఏసిపి సత్యనారయణ, ఇన్స్‌స్పెక్టర్లు వెంకన్న, సీతరెడ్డి, సుజాత, వాగ్దేవి కళాశాల ప్రిన్స్‌పాల్ శేషాచలం, కరస్పాడెంట్ శ్రవణ్ రెడ్డి హరిచంద్రరెడ్డి పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :