ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం తన కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేశారు. ముహూర్తం ప్రకారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ ప్రకటనకు ముందు కవిత నివాసం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఆమె పూజలు నిర్వహించగా, అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ధరించిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్త పార్టీ జెండాకు ఎంపిక చేసిన ప్యారెట్ గ్రీన్, డార్క్ బ్లూ అంచుతో ఉన్న రంగులతో కూడిన చీరను ఆమె ధరించారు. ఇది ఆమె సిద్ధాంతాలకు, పార్టీ కొత్త అజెండాకు సంకేతమని కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ వేదికగా భారీ బహిరంగ సభ... నివాసం వద్ద పూజల అనంతరం కవిత మేడ్చల్ జిల్లా మున్నేరాబాదు లో జరగనున్న భారీ బహిరంగ సభకు బయలుదేరారు. అక్కడే ఆమె తన కొత్త పార్టీ పేరు, జెండా, విధివిధానాలను అధికారికంగా ప్రకటించారు. అనంతరం కవిత మాట్లాడుతూ కాంగ్రెస్, బి ఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులను ఉతికి ఆరేసింది. ఈ మూడు పార్టీల నాయకులు కలిసి పేద ప్రజలను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బానిస సంకెళ్లు పోతాయనుకుంటే బానిస బతుకుల వచ్చాయన్నారు రైతులకు బేడీలు పడ్డాయని రైతులకు ఎంత కష్టమొచ్చినా ఆ సారు రారు ఆ సారా రారు ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు అంటూ విమర్శించారు. ఫామ్ హౌస్ లో సార్ ఉంటారు చిన్నసార్కు సీఎం పదవి ఇప్పించాలని శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక మరో దిక్కు చూస్తే కర్క్కోటకుడి పాలనలో ప్రజలు బోసపడుతున్నరు ఇబ్బంది పడుతున్నారు హైదరాబాదులో పేద ప్రజల ఇండ్లన్నీ హైడ్రా పేరుతో కూల్చి వేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం ఉద్యోగాల పేరిట నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి తన ప్రభుత్వం వచ్చాక ప్రణాళిక రూపొందిస్తానన్నారు. అందరూ మన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి మద్దతు ఇస్తారా ఇస్తారా అంటూ నినాదాలు చేయగా ప్రజలంతా ఇస్తాం ఇస్తాం అంటూ నినాదాలు చేశారు. 'వాయిస్ లేని వారికి గొంతుకగా' తన పార్టీ నిలుస్తుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా సెప్టెంబర్ 2025లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కవిత, ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలే తన ప్రధాన లక్ష్యమని ఆమె ప్రకటించడంతో, రాబోయే రోజుల్లో రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి బిజెపి పార్టీ అన్నారు మహిళా బిల్లు పూర్తిగా మోసపూరితమని కులగణన పేరుతో కూడా తొక్కి పెట్టాలని చూస్తున్నారని తీయబడ్డారు ఉపాధి హామీ పథకాన్ని బందు పెట్టి పేద ప్రజల పొట్ట కొట్టారని దుయ్యబట్టారు. నీళ్ల కోసం ఒక సంవత్సరంలో ఒక లక్ష 89 వేల కోట్లు ఖర్చు పెట్టింది 14 లక్షల ఎకరాలకు నీళ్లు మాత్రం ఇచ్చారన్నారు. పాలమూరు కాలేశ్వరం ఒక లక్ష ఇరవై వేళ కోట్లు ఖర్చుపెట్టి లక్ష ఎకరాల కో నీరు ఇచ్చింది అప్పుడు నేను కూడా పార్టీలోనే ఉన్నారని ప్రశ్నించినందుకు నన్ను పక్కన పెట్టి ఇప్పుడు కేసీఆర్ మరో మనిషిగా మారారని తోడేళ్ల చేతిలో ఇరుక్కుపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. నక్కల చేతిలో ఖైదీ అయిన మనిషి అని ఆవేదనతో చెబుతున్నానని తెలిపారు తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు కదా బయటకు వస్తలేరు. సమాధానం చెప్తే లేరు దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఆమె అన్నారు. మరోవైపు బిజెపి పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు ఆంధ్రలో కలిపిన 5 మండలాలను తెలంగాణలో కలపడంలో ఎందుకు ముందుకు రావడం లేదని అన్నారు. చేతగాని నాయకుడు ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇలానే ఉంటుందని అన్నారు. పార్లమెంటులో తలకాయ లేని మనిషి మాట్లాడిన మాటలకు కనీసం కౌంటర్ కూడా వేయకపోవడం ఎంతవరకు సమంజసం అని ఎద్దేవా చేశారు. ఇదా తెలంగాణ బిజెపి నాయకుల తీరన్నారు. ఇక మరోవైపు కర్కోటకుడు తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతూ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లేదని మళ్లీ పార్టీకి పుట్టగతులు ఉండాలని తెలిపారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధికారం చేపట్టాక అన్ని పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో భారీగా మహిళలు యువకులు ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News