Thursday, 30 July 2026 10:03:07 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం... భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, సిర్పూర్ ఎమ్మెల్యే

Date : 25 November 2025 11:42 PM Views : 209

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రెనుదో మంగళవారం కలిసి జిల్లాలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, మరియు సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 335 సర్పంచ్ స్థానాలకు గాను కేవలం 20 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు. బెజ్జూర్ మండలంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు కేటాయించలేదని అన్నారు. కాగజ్నగర్ డివిజన్లో కేవలం 11.11% సర్పంచ్ సీట్లు బీసీలకు కేటాయించారని, ఆసిఫాబాద్ డివిజన్లో కేవలం 7.21 % కేటాయించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీఓ మరియు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం బీసీలకు ఇవ్వాల్సిన 23 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని, దీనిని సరిదిద్దాలని జిల్లా కలెక్టర్ కువినతి పత్రం సమర్పించారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సర్పంచ్ స్థానాలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మొత్తం మీద కేవలం 9 శాతం సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు.వెంటనే ఈ బీసీ రిజర్వేషన్లలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్, జిల్లా కోశాధికారి కొలిపాక కిరణ్, అరుణ్ లోయ, అనిల్, గాజుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :