Thursday, 30 July 2026 10:23:48 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన..

స్కూల్ విద్యార్థులచే "ఖాకీ కిడ్స్" పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 22 February 2026 02:33 PM Views : 130

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా "ఖాకీ కిడ్స్" పేరుతో నూతన కార్యక్రమాన్ని శనివారంఉదయం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ ఆవరణ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్ర డిజిపి. బి. శివధర్ రెడ్డి చే ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్" లో భాగంగా,ఈకార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలు ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు "ఖాకీ కిడ్స్" గా మారనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కానిస్టేబుల్ ని ఎంపిక చేసి ఈ కానిస్టేబుల్ ప్రతి వారంలో మూడు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సైబర్ క్రైమ్ ఫై మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించి వారిని "ఖాకీ కిడ్స్" గా మార్చనున్నారు. అవగాహన పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లా పోలీసు శాఖ తరపున ఒక బ్యాడ్జిను అందజేయడం జరుగుతుందన్నారు. వీరు తమతో పాటుగా తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను చుట్టుపక్కల వాళ్ళని వారికి తెలిసిన ప్రతి ఒక్కరిని హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని, రోడ్డుపై ట్రిబల్ రైడింగ్, కార్ల నందు సీట్ బెల్ట్, రాజ్ డ్రైవింగ్ జరగకుండా ప్రోత్సహించి ప్రమాదాలను అరికట్టేలా తమ వంతు పాత్ర పోషించాలని పోలీసు వ్యవస్థకు సహకరించి ప్రాణనష్టాన్ని తగ్గించాలని తెలిపారు. అదేవిధంగా దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడానికి అవగాహన మాత్రమే ఉపయోగపడుతుందని, అవగాహన కల్పించి చైతన్య పరచడంతో సైబర్ నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. వీరందరికీ ప్రతిరోజు జిల్లాలో జరుగుతున్న నూతన సైబర్ క్రైమ్ పద్ధతులను సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న తీరులను వివరించి చైతన్యపరచాలని తెలిపారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఆర్థిక నేరాలలో గోల్డెన్ హవర్ ప్రాముఖ్యతను తెలియజేయాలని తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు ఇంటర్నెట్ వాడటం ద్వారా వాటిచే జరిగే దుర్వినియోగం, ఆన్లైన్ మోసాలు, వాటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి పరిపాలన పి. మౌనిక ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, కె స్వామి, ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, రిసర్వ్ ఇన్స్పెక్టర్లు టి మురళి, ఎన్ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :