ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్లకు కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో త్వరలో లైన్ క్లియర్ కానుంది.తెలంగాణ రాష్ట్రంలో ఇన్- సర్వీస్ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సమస్య లను తొలగించే దిశగా చర్యలకు పూనుకుంది. ఉపాధ్యాయులు ప్రమోషన్ కు అర్హత సాధించాలంటే తప్పకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్,క్వాలిఫై కావాలి. కానీ చాలా మంది టీచర్లు ఈ అర్హత సాధించ క పదోన్నతులకు దూరమ వుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిసర్కార్ వారికి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ లోపు రెండు ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోన్న విద్యాశాఖ ఇప్పటికే దీనిపై ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. గతంలో 2011 కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మిన హాయింపు ఉంటుందని భావించారు. కానీ 2025 లో సుప్రీంకోర్టు వెలువరిం చిన తీర్పుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని ప్రకారం పదోన్నతు లు పొందే ప్రతి ఉపాధ్యా యుడు టెట్ పాస్ కావ డం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో టెట్ క్వాలిఫై కాని టీచర్లు 31 మార్చి 2027 నాటికి టెట్ సాధించకపోతే పదోన్నతులకు అనర్హులు గా ఉంటారని నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో నే తెలం గాణ విద్యాశాఖ రెండో టెట్ నిర్వహించా లని భావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు 1.02 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 57 వేల మంది టెట్ అర్హత సాధించలేదు. అయితే గతంలో వివిధ దశల్లో విద్యాశాఖ నిర్వహించిన టెట్ లో 30 వేల మంది టీచర్లు అర్హత సాధించారు. ఇంకా 27 వేల మంది టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. ప్రస్తుతం విడుదలైన టెట్ నోటిఫికేష న్ ద్వారా కొంతమంది గట్టె క్కే అవకాశం ఉన్నప్పటికీ, మిగిలిన వారందరికీ ఈ ఏడాది నిర్వహించే రెండు ప్రత్యేక టెట్ పరీక్షలు కీలకం కానున్నాయని చెప్పవచ్చు.
Admin
E Nivas News