ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ జిల్లాలో ఆర్ఎంపి వైద్యుడిపై దాడి చేసి గొలుసును దొంగలించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కరీంనగర్ సిపి గౌస్ సలాం తెలిపిన వివరాల ప్రకారం, గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు, పెద్దపల్లి జిల్లా బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన ఒక యువకుడు, మరియు ఒక మైనర్ బాలుడు ఈ నేరానికి పాల్పడ్డారని తెలిపారు. వీరు గతంలో కరెంటు మోటార్ల దొంగతనం కూడా చేసినట్లు సిపి తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులను సిపి అభినందించారు.
Admin
E Nivas News