ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రవల్లి రఘునాథ్ తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన గ్రామంలో 10 లక్షల రూపాయల స్వంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఇచ్చిన హామీ మేరకు గురువారం లక్షెట్టిపేట మండలం లోని లక్ష్మీపూర్ గ్రామంలో సర్పంచ్ గా బీజేపీ అభ్యర్థి సురమళ్ల సౌజన్య గెలవడంతో హామీ నెరవేర్పుకై గ్రామంలో నీటి సమస్య తీర్చడానికి రెండు బోర్ వెల్స్ కు సర్పంచ్ సురమళ్ల సౌజన్య ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ భూమి పూజ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ అభ్యర్థులు గెలిచిన ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గతంలో 10 సంవత్సరాలు బి ఆర్ ఎస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా గ్రామాలకు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, కారుకూరి మధుకర్, పెట్టం శ్రీరామ్, అప్పని శ్రీకాంత్, రంజిత్, కందుల వరక్క, ఇందూరి లింగయ్య, అప్పని గంగయ్య, చిన్న, కందుల లక్ష్మణ్, తగరపు గంగన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News