ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ రాజ్యసభ ప్రాంగణంలో ఘనంగా గురు వారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి డా. వివేక్వెంకటస్వామి , పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డి ని మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు సహచరప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. వేం నరేందర్ రెడ్డి తన పదవీకాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News