Thursday, 30 July 2026 08:19:54 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

డిసెంబర్ 7,8,9 వ తేదీలలో జరిగే సీఐటియు రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయండి

Date : 05 December 2025 11:23 PM Views : 229

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 7 8 9 తేదీలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం డిసెంబర్ 7,8,9 వ తేదీలలో జరుగుతున్న సీఐటియు రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కరమే ద్యేయంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ. కేంద్రంలో నరేంద్రమోడీ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ ను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సహకరించడం చాలా దారుణం. బ్రిటిష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను రద్దు చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విదంగా ఈ చట్టాలను తెచ్చారు. ఈ చట్టాలు అమలు జరిపి కార్మికులను బానిసలుగా మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వానికి అధిక ఆదాయం తీసుకొచ్చే హమాలీ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వం వేట్టి చాకిరీ చేయించుకుంటూ కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తుం దన్నారు.హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. కనీస వేతనాలు చెల్లించాలి. అర్హులైన నిరుపేద కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలను, భవిష్యత్తు కార్యచరణను ఈ రాష్ట్ర మహాసభలలో చర్చించుకోవడం జరుగుతుం దన్నారు. డిసెంబర్ 7న మెదక్ పట్టణంలో జరిగే ర్యాలీ ప్రదర్శన, బహిరంగ సభలో అధిక సంఖ్యలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజేశ్వరి సీఐటీయు జిల్లా సహాయ సహాయ కార్యదర్శి, ఏ.మౌలాలి జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు చిప్పకుర్తి కుమార్, గడ్డం అంజి, దర్శనాల గిరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :