Friday, 31 July 2026 04:37:25 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తాం

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 03 November 2025 08:02 PM Views : 305

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం లక్షెట్టిపేట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని వెంకటేశ్వర కాటన్ మిల్ లో సి సి ఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి షాహబోద్దీన్, సి. సి. ఐ అధికారులు, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సి సి ఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. 2025- 26 సంవత్సరంలో మద్దతు ధర క్రింద సి.సి.ఐ. కు పత్తి విక్రయించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని, పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈసారి ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 స్థాయిలలో స్లాట్ బుకింగ్ చేయడం జరుగుతుందని, ప్రతి స్థాయిలో 75 శాతం స్లాట్ లు బుక్ అయిన తర్వాత స్థాయిలో బుకింగ్ ఓపెన్ అవుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నిబంధనల ప్రకారం పత్తిలో 8 నుండి 12 తేమ శాతం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. ఆధార్ నంబర్ కు అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయని, ఆధార్ కార్డులో ఫోటో కలిగి ఉన్న రైతు మాత్రమే తక్పట్టిలో ఫోటో దిగవలసి ఉంటుందని తెలిపారు. క్రాప్ బుకింగ్ లో నమోదు చేసిన రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి సమన్వయంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దళారులు కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాలలోనికి అనుమతించకూడదని తెలిపారు. పత్తి కొనుగోలుతో పాటు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో చేపట్టడం జరుగుతుందని, రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సంబంధి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :