Saturday, 01 August 2026 07:54:47 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి)

యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న నారా లోకేష్ :- జి.నాగముని(ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్)

Date : 30 July 2026 09:45 PM Views : 19

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోనీ, జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై న్యాయవాదుల సంఘం నాయకులు భారీ కేక్ ను కటింగ్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పడుతుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించడం గొప్ప అభినందించవలసిన విషయం అని అన్నారు. అనంతరం న్యాయవాది జి.నాగముని ఆధ్వర్యంలో జిల్లా బార్ అసోసియేషన్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, పరిశ్రమల శాఖామంత్రి టి.జీ.భరత్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 45 రోజులపాటు నిర్వహించిన యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయని, ఎప్పటికప్పుడు హామీల పుస్తకాన్ని చూసుకుని తానిచ్చిన ప్రతి హామీ నెరవేర్చేం దుకు చర్యలు చేపట్టానని పేర్కొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, న్యాయవాదుల సంఘం నాయకులు పోరాడి మరీ పరిశ్రమలను కర్నూలుకు తీసుకొస్తున్నారని.. రెండో ముంబై గా ప్రసిద్ధి చెందిన ఆదోనికి పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. డ్రోన్ సిటీ నిర్మాణం జరుగుతోందని, టాటా సోలార్ ప్రాజెక్టుకు గురువారం శంకుస్థాపన చేయనున్నామని వెల్లడించారు. 'కూటమి ప్రభుత్వ హయాంలో జొన్నగిరిలో బంగారం కర్మాగారం రాగా, వైకాపా హయాంలో బ్రాహ్మణి స్టీల్ కుంభకోణం జరిగిందన్నారు. కూటమి హయాంలో రాయలసీమలో ఉద్యానహబ్ రాగా, వైకాపా హయాంలో రాయలసీమలో రక్తం పారిందన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్, ఐదోతరం యుద్ధవిమానాల తయారీ కేంద్రం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జగదీష్ దాశెట్టి శ్రీనివాసులు, మోహన్ బాబు, బడేసాబ్, మద్దెస్, గోవిందు, మురళి నాయుడు, బి.చంద్రుడు, బిఎస్.రవికాంత్ ప్రసాద్, పి.రవి గుణేరా, రంగా రవికుమార్, శ్రీనివాస్ బట్, ఏ.మాడన్న సింగ్, సీనియర్, జూనియర్ నాయకులు గణేష్ సింగ్, ఈ.రాజేష్, జహంగీర్ భాష, మహిళా న్యాయవాదులు జయలక్ష్మి, కరుణ జ్యోతి, సుమన రాణి, జనసేన, బిజెపి, టిడిపి, టిడిపి న్యాయవాదులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: