Friday, 17 April 2026 05:03:40 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ఆత్మకూరు ఖబ్రస్తాన్ కొరకు 4 ఎకరాలు వితరణ

*వక్ఫ్ బోర్డు ద్వారా వారి ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని ఖబ్రస్తాన్ కు అందచేసిన ముల్లా కుటుంబం.

Date : 09 November 2025 08:57 PM Views : 636

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : *శాలువాలు కప్పి, అభినందించి, ఘనంగా సన్మానం చేసిన ఆత్మకూరు మజ్లిసుల్ ఉలేమా, ఆత్మకూరు మస్జీద్ కమిటీల ముతవల్లీలు, మత పెద్దలు* 50 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని వారి ఆధ్వర్యంలో ఉన్న ముల్లా కుటుంబం ఆత్మకూరు ఖబరస్థాన్ కు వితరణ చేయడం సంతోష దాయకమని ఆంధ్రప్రదేశ్ ముస్లిం పర్సనల్ లా బోర్డు కన్వీనర్ మౌలానా జాకీర్ సాబ్ రషాది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఉన్న ఈ స్థలం నిరుపయోగంగా ఉండడం మరియు తగిన కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనించిన ముల్లా కుటుంబానికి చెందిన ఖమృన్ బి, బి.సలాం, బి.మక్బుల్ లు ఈ స్థలాన్ని ఆత్మకూరు ఖబ్రస్థాన్ కు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేట మసీదు నందు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందించవలసినదిగా తెలిపారు. అల్లా మార్గంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో సేవా కార్యక్రమాలకు ముందుండాలని, మహమ్మద్ ప్రవక్త నేర్పిన సన్మార్గంలో, అందరికీ ఆదర్శంగా నలుగురికి సాయం చేసేలా నడవాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు పట్టణానికి చెందిన మజ్లీసుల్ ఉలేమా అధ్యక్షుడు- రహంతుల్లా మౌలానా, మజ్లిసుల్ ఉలేమా ప్రధాన కార్యదర్శి- ముఫ్తీ నూర్ మొహమ్మద్(ఆత్మకూరు), ఆలిమ్ లు జబీవుల్లా మౌలానా (ఆత్మకూరు), ఇలియాజ్ మౌలానా, ముర్తుజా మౌలాన, వివిధ మసీదుల కమిటీల ముతవల్లీలు, ఆత్మకూరు ముస్లిం మత పెద్దలు మరియు పాములపాడు, కొత్తపల్లె మండలాలకు చెందిన ముస్లిం మత పెద్దలు పాల్గొని, ఆ కుటుంబాన్ని అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :