ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, బైర్లూటి గ్రామంలో గల ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2026 -27 సంవత్సరానికి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల ప్రవేశాల కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్- సుమయ్య తబస్సుం విలేఖరుల సమావేశంలో తెలిపారు. గిరిజన పాఠశాలలో మూడవ తరగతికి ఎస్టీ విద్యార్థినీలకు-32, ఎస్సీ-5 , బిసి-2, ఓసి-1 సీట్లు ఉన్నాయని అన్నారు. 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఎస్టీ విద్యార్థులకు మాత్రమే దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సుమయ్య తబస్సుం తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్- 9346169138, 8790390910 నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవచ్చునని తెలిపారు.
Admin
E Nivas News