Friday, 31 July 2026 04:59:16 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

చిన్నారుల చేతిలో మొబైల్ కాదు… పుస్తకం ఉండాలి..! విజ్ఞానానికి విత్తనం చిన్నారుల గ్రంథ పఠనం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

Date : 03 February 2026 08:32 PM Views : 125

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : చిన్నారుల చేతిలో మొబైల్ కాదు.. పుస్త‌కం ఉండాల‌ని, విజ్ఞానానికి విత్త‌నం గ్రంథ ప‌ఠ‌న‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. వారానికి ఒక రోజు విద్యాసంస్థలన్నింటిలోనూ ఒక ప్ర‌త్యేక సెషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్త‌క ప‌ఠ‌నాన్ని అలవాటు చేసేలా ఉపాధ్యాయుల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మరో గ్రంథాలయ ఉద్యమం - హైదరాబాద్ నుండి అమరావతికి పుస్తకంతో బస్సుయాత్ర కార్య‌క్ర‌మంలో భాగంగా మంగళవారం ఉదయం విజయవాడలోని, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బ‌స్సు యాత్ర చేరుకుంది. ఆ బస్సుయాత్రకు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ స్వాగతం పలికారు. బస్సుయాత్ర చేస్తున్న పుస్తక ప్రేమికుల్ని, రచయితల్ని, ఉద్యమకారుల్ని ఆత్మీయంగా పలకరించారు. బస్సుయాత్ర విశేషాలను ఉద్యమ సారథి మంచికంటిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో పెరిగిపోయిన మొబైల్ కల్చర్ ను తగ్గించాలంటే బుక్ రీడింగ్ ఒక్కటే మార్గమన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు బాగా పెంచాలన్నారు. వాళ్ళను గ్రంథాలయాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఆ దిశగా ఉద్యమిస్తున్న మరో గ్రంథాలయ ఉద్యమ నాయకులందర్నీ అభినందించారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాలోనూ విద్యాలయాల్లో వారానికి ఒక్కరోజు పాఠ్యాంశేతర పుస్తకాలను చదివే విధంగా ఒక సెషన్ ఏర్పాటు చేసేలా ఉపాధ్యాయుల్ని ప్రోత్స‌హిస్తామ‌న్నారు. అవకాశమున్న పార్కుల్లో మినీ మొబైల్ గ్రంథాలయాల ఏర్పాటు గురించి పరిశీలించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా 'జయహో పుస్తకం' పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నవ మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు యేమినేని వెంకటరమణ సారథ్యం వహించారు. ఈ కార్యక్రమంలో మంచికంటి, బండారు విజయ, కాసుల రవికుమార్, సీఏ ప్రసాద్, కాంతి నల్లూరి, పైడిమర్రి విజయ, కందుకూరు రాము, కస్తూరి ప్రభాకర్, కాసుల శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :