ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు డివిజన్ పరిధిలోని, అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ కోరుతూ సోమవారం నాడు ఆత్మకూరు పట్టణంలో మండల అభివృద్ధి అధికారి- పి.నాగేంద్రుడు కి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ ఎంపీడీవో- పి.నాగేంద్రుడు కు విన్నవిస్తూ గత 30 సంవత్సరాల నుంచి అమలాపురం చెంచుగూడెంలో 50 కుటుంబాల చెంచు గిరిజనులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, .వారికి ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం సిమెంట్ రోడ్లు అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆయన అన్నారు. అక్కడ చదువుకునే చాలా మంది విద్యార్థులు ఉన్నారను, ప్రభుత్వం ఒక ఉపాధ్యాయురాలుని కూడా నియమించిందన్నారు. పది సెంట్లు పాఠశాల స్థలం కూడా ఉందనీ. కానీ పాఠశాల భవనం మాత్రం లేదనీ. చదువుతోనే గిరిజనుల అభివృద్ధి అని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గిరిజనుల తలరాతలు మాత్రం మారటం లేదనీ. ఎన్నికల సమయంలో మాత్రమే చెంచు గిరిజనులు గుర్తుకు వస్తారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం చెంచుగూడెంలో పాఠశాల భవనం నిర్మించుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈరమ్మ, నాగరాజు, నరేష్ , బయ్యన్న పాల్గొన్నారు.
Admin
E Nivas News