ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఇటీవల విడుదలైన 2025-26 పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన స్థానిక ‘శ్రీ వివేకానంద విద్యా విహార్ ఉన్నత పాఠశాల’ విద్యార్థి సయ్యద్.అయాజ్ అలీ రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమంగా 582 మార్కులు సాధించి, డిస్టింక్షన్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన అయాజ్ అలీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. ఘనంగా ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానం కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలోని, ప్రతిభను ప్రోత్సహించడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం నంద్యాల జిల్లా కేంద్రంలోని, కలెక్టరేట్ కార్యాలయంలో వైభవంగా జరగనుంది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో, జిల్లా మంత్రుల చేతుల మీదుగా విద్యార్థి సయ్యద్.అయాజ్ అలీ ఈ ప్రతిభా పురస్కారాన్ని అందుకోబోతున్నారు. *పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయుల హర్షం* శ్రీ వివేకానంద విద్యా విహార్ ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్ ఎస్ ఆర్. గోపాల్ మాట్లాడుతూ సయ్యద్. మహమ్మద్ అయాజ్ అలీ మొదటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ, క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివి ఈ ఘనత సాధించాడని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనియాడారు. విద్యార్థి సాధించిన ఈ విజయం పాఠశాలకే కాక, యావత్ నంద్యాల జిల్లాకే గర్వకారణమని వారు పేర్కొన్నారు.
*తల్లిదండ్రుల ఆనందం* తమ కుమారుడు పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడమే కాకుండా, ప్రభుత్వ అధికారిక పురస్కారానికి ఎంపిక కావడం పట్ల సయ్యద్.అయాజ్ అలీ, తల్లిదండ్రులు సయ్యద్.ముర్తుజాఅలీ ఆనంద బాష్పాలతో తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడి విజయానికి సహకరించిన పాములపాడు శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్ ఎస్ ఆర్.గోపాల్, హెడ్మాస్టర్ రాయపాటి దేవిక, యాజమాన్యానికి, ప్రతిక్షణం మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రతిభా పురస్కారం భవిష్యత్తులో సయ్యద్.అయాజ్ అలీకి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి బలమైన పునాది కాగలదని స్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్. గోపాల్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తోటి విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారనీ తెలిపారు.
Admin
E Nivas News