ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గంలోనీ, ఆలూరు గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జి మాండ్ర.శివానంద రెడ్డి కి నంద్యాల జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు సయ్యద్.షర్ఫద్దీన్ అలీ, భావన వినోద్ కుమార్ లు జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు ఎస్.షర్ఫద్దీన్ అలి, భావన వినోద్ కుమార్ లు మాట్లాడుతూ మాండ్ర.శివానందరెడ్డి పోలీస్ శాఖలో సిన్సియారిటీగా పనిచేసి అందరి మన్ననలు పొంది ఉన్నత ఉద్యోగాలు చేయడం గర్వకారణం అన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాజకీయాలలో కూడా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ గా ఉండి తెలుగుదేశం పార్టీలో మచ్చలేని నాయకుడిగా ఎదిగి, పార్టీ అధికారం ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. ఆయన అందరికీ అందుబాటులో ఉండి, నందికొట్కూరు నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా, జిల్లా అభివృద్ధికి కూడా ఎంతో పాటుపడడం జరిగిందన్నారు. అటువంటి మంచి వ్యక్తి, అందరివాడు మాండ్ర.శివానందరెడ్డి భవిష్యత్తులో మంచి మంచి పదవులు చేపట్టి, రాయలసీమ అభివృద్ధికి పాటుపడాలని, జీవితాంతం ఆయన మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవున్నీ కోరుకుంటూ, ఆకాంక్షించడం జరిగింది.
Admin
E Nivas News