Friday, 31 July 2026 07:24:42 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ 69వ వర్ధంతి సందర్బంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించిన ప్రజాసంఘాల నాయకులు

Date : 07 December 2025 01:23 PM Views : 266

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సామాజిక వేత్త డాక్టర్ డి.నాగన్న, భామ్సెప్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల హరిప్రసాద్, ఎస్ఐ- కే.సురేష్ బాబు, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, బీసీ ఐక్య సంఘం అధ్యక్షుడు గట్టు.శంకర్ గౌడ్, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి డాక్టర్ బత్తుల. సంజీవరాయుడు, డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు, మండల కో ఆఫ్టెడ్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, సిపిఎం పార్టీ నాయకుడు డి.స్వామన్న, తదితర ప్రజా సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భముగా ప్రజాసంఘాల నాయకులు సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ డి.నాగన్న, భామ్సెప్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల హరిప్రసాద్, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, సిపిఎం పార్టీ నాయకులు డి.స్వామన్న, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు ఎన్.అబ్రహం, బిసి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు, సమాజ సేవకుడు కే.నాగరాజు, మండల కో ఆఫ్టేడ్ నెంబర్.ముర్తుజాఅలి, బిసి ఐక్య సంఘం అధ్యక్షుడు గట్టు. శంకర్ గౌడ్, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కే.అంకన్న లు మాట్లాడుతూ ఈరోజు డిసెంబరు 6వ తేదీకి చాలా ప్రాముఖ్యత వుందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అమరుడయిన రోజు 6 డిసెంబర్, 1956 కనుక ఆయన దళిత, గిరిజన, శ్రమ జీవుల, స్త్రీల బానిస విముక్తి, హక్కులు కల్పించిన మహనీయుడు, మైనారిటీ,సమస్త పీడిత ప్రజల హక్కులకై రాజ్యాంగ బద్దంగా ఆయన పోరాడడమే గాక ఆ హక్కులను రాజ్యాంగంలో పొందుపరచిన మహనీయుడు అంబేద్కర్.ఫూలే ప్రారంభించిన సామాజిక న్యాయ సిద్దాంతాన్ని అభివృద్ధి చేసి కొనసాగించడంతో పాటు, తాను రూపొందించిన, కుల నిర్మూలనా సిద్ధాంతాన్ని సామాజిక న్యాయ సిద్ధాంతంతో జోడించి కృషి చేసిన సిద్దాంత వేత్త అంబేద్కర్. మన దేశ ప్రజల బాధలకు కారణం అయిన మనుస్మృతిని దహనం చేసినవాడు అంబేద్కర్ అని అన్నారు. డిసెంబర్- 6వ తారీఖుననే 1992లో మనువాద, మతోన్మాద శక్తులు బాబ్రీ మసీదుని కూల్చారన్నారు. అంబేద్కర్ ప్రారంభించిన మనువాద వ్యతిరేక పోరాటం ఆపవలసింది కాదని మరింత శక్తివంతంగా కొనసాగించ వలసి వుందని, డిసెంబరు ఆరవ తేదీ మనకు చాలా బలంగా గుర్తు చేస్తుందన్నారు. కావున రానున్న రోజుల్లో ఆయన ఆశయం ఒక్కటే బహుజనులు రాజ్యాధికారం దిశగా నా ప్రజలు ఎదుగుతారో అప్పుడు నాకు సంతోషం అని ఆనాడే అన్న మహనీయుడు బాబాసాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగంను బాగా చదివి, అందులోని హక్కులు, ఆర్థికల్స్, సెక్షన్లు పరిపాలన వ్యవస్థను గూర్చి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ యూత్ & సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, బానకచర్ల గ్రామ ఉపసర్పంచ్ నరసింహులు గౌడ్, బౌద్ధ బోధి శేషగిరి, వైయస్ఆర్సిపి నాయకుడు శెట్టి.శివ లింగం, సోషల్ మీడియా ప్రతినిధులు డక్క.శ్రీకాంత్, గోవిందు, టీడీపీ నాయకులు, వెంకటస్వామి, కలబండి.నాగన్న, గోవిందు ప్రజా ప్రతినిధి, వడ బీజేపీ జిల్లా నాయకులు చల్లా దామోదర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, గౌడ సంఘం నాయకుడు గాలి గౌడు, మాల మహానాడు నాయకుడు మేకల భాస్కర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :