Friday, 31 July 2026 09:39:24 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 145 అర్జీలు..!ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేక దృష్టిపెట్టండి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 16 February 2026 07:41 PM Views : 177

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) జిల్లాస్థాయి కార్య‌క్ర‌మానికి 145 అర్జీలు వ‌చ్చాయ‌ని.. ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టి అర్జీదారులు సంతృప్తి చెందేలా ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌జ‌ల నుంచి రెవెన్యూ, రెవెన్యూయేత‌ర అర్జీలు స్వీక‌రించారు. ఈ గ్రీవెన్స్ కార్య‌క్ర‌మంలో 62 రెవెన్యూ అర్జీలు, 83 రెవెన్యూయేత‌ర అర్జీలు వ‌చ్చాయి. రెవెన్యూయేత‌ర అర్జీల్లో పుర‌పాల‌క శాఖ‌కు-24, పోలీసు శాఖ‌కు-18, డీఆర్‌డీఏకు-7, గృహ‌నిర్మాణానికి ఆరు అర్జీలు వ‌చ్చాయి. పంచాయ‌తీరాజ్‌కు 4, వ్య‌వ‌సాయ‌, ఆరోగ్య శాఖ‌ల‌కు మూడు చొప్పున అర్జీలు అందాయి. విద్య‌, మార్కెటింగ్‌, విభిన్న ప్ర‌తిభావంతులు, ర‌హ‌దారులు-భ‌వ‌నాలు, ఆర్ఐవోకు రెండు చొప్పున అర్జీలు వ‌చ్చాయి. విద్యుత్‌, ప్ర‌జా ర‌వాణా, ఎండోమెంట్‌, ప‌శుసంవ‌ర్థ‌క‌, డ్వామా, అడ‌వులు, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, నైపుణ్యాభివృద్ధి విభాగాల‌కు ఒక్కో అర్జీ వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా ప్రతి సమస్యను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై సంబంధిత శాఖాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. రెవెన్యూ మరియు రెవెన్యూయేతర దరఖాస్తులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప‌రిష్క‌రించాల‌న్నారు. అర్జీల ప‌రిష్కారంపై క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వయం చేసుకుంటూ స‌త్వ‌ర ప‌రిష్కారానికి కృషి చేయాల‌న్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :