Friday, 31 July 2026 10:29:28 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య

Date : 09 February 2026 12:06 AM Views : 395

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి/పుత్తూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు సంసారాన్ని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా, పుత్తూరు మండలంలోని, నేషనూరు అనే గ్రామానికి చెందిన పద్మ (28) అనే వివాహిత తన ఇద్దరు కుమార్తెలకు (6, 5 ఏళ్లు) ఉరేసి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 2019లో తల్లిదండ్రులను ఎదిరించి తన డిగ్రీ క్లాస్ మేట్ అయిన శివశంకర్‌ అనే యువకుడిని పద్మ పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత తన భర్త పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ అప్పులు చేయడం, కనీసం పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో "తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం. ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి. ఇక ఉంటా! నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఈ సారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో" అంటూ లేఖ రాసి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఉరి వేసుకొని, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. భర్త శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త శివశంకర్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :