ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా మండలంలోని, మండ్లెం గ్రామంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆద్వర్యంలో మెడికల్ ఆఫీసర్ మౌనిక సహకారంతో హెచ్ఐవి/ఎయిడ్స్, సుఖ వ్యాధుల పట్ల మరియు రక్త పరీక్షలులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డా.మౌనిక మాట్లాడుతూ హెచ్.ఐ.వి వ్యాధి పట్ల కమ్యూనిటీ , మరియు యువతకు హెచ్.ఐ.వి పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల హెచ్.ఐ.వి కి గురికాకుండా చూసుకోవచ్చని, చికిత్స కన్నా నివారణ మంచిదని తెలిపారు. ఈ సందర్భంగా చైల్డ్ ఫండ్ ఇండియా డిఆర్పి-నాగరాజు మాట్లాడుతూ హెచ్.ఐ.వి కేవలం అక్రమ సంబంధాల ద్వారా, అసురక్షిత లైంగిక సంబంధాలు ద్వారా, హెచ్.ఐ.వి ఉన్న గర్భిణీ నుండి పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశం ఉందన్నారు. కనుక హెచ్ఐవి/ఎయిడ్స్ ఉన్న గర్భవతులు ఏ ఆర్ టి మందులు వాడితే బిడ్డకు హెచ్ఐవి వచ్చే అవకాశం ఉండదన్నారు. హెచ్ఐవితో కలుషితమైన సూదులు, సిరంజీలు, పరీక్షింపబడని రక్తము ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్.ఐ.వి పరీక్షలు ఉచితంగా చేస్తారని, అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అదేవిదంగా, హెచ్.ఐ.వి. ఉందని నిర్ధారణ అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ ఆర్ టి కేంద్రాలు, లింక్ ఏ ఆర్ టి కేంద్రాల ద్వారా ఉచితంగా ఏఆర్టి మందులు అందుబాటులో ఉన్నాయని, మందులు వాడుతూ, వైద్యుల సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చు అని తెలియచేసారు. హెచ్.ఐ.వి. ఉందనే కారణంతో ఎవరు కూడా వివక్ష చూపకూడదని అన్నారు. ఆ విధంగా వివక్ష చూపితే హెచ్.ఐ.వి./ ఎయిడ్స్ చట్టం - 2017 ప్రకారం శిక్షార్హమైన నేరమని తెలియచేసారు. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పట్ల ఎటువంటి సందేహాలు/ అనుమానాలు ఉన్నా జాతీయ హెల్ప్ లైన్- 1097 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని అవగాహన కల్పించారు. కండోమ్ బాక్సులు కూడా రోడ్ల ప్రక్కన ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 100 గ్రామాల్లో అవగహన సదస్సులు మరియు సేవలు అందించడం జరుగుతుంది. ఈ చైతన్య కార్యక్రమంలో ముఖ్యముగా యువత, మహిళలు, పొదుపు సంఘాలు, కార్మికులు , గ్రామ ప్రజలను భాగస్వాములు చెయ్యాలని చేప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ పి- పి.నాగరాజు, సిహెచ్ఓ- బీసమ్మ, ఏఎన్ఎం-నాగమణి, పి హెచ్ ఎన్- సరోజమ్మ, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్- టీ.షాజహాన్ బేగం, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News