ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు శాఖా గ్రంధాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని గ్రంథాలయ అధికారి- సి.వి.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులచే గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా లైబ్రేరియన్ సి.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయంలో రకరకాల కథల పుస్తకాలు, విజ్ఞానానికి, వినోదానికి, భారత దేశ చరిత్ర గురించి, స్వాతంత్ర సమరయోధుల గురించి, రాజ్యాంగం గురించి, ఉద్యోగాల గురించి, స్వయం ఉపాధి గురించి రకరకాల పుస్తకాలు ఉంటాయన్నారు. అదేవిధంగా ప్రతిరోజు దినపత్రికలు కూడా అందరికీ అందుబాటులో కనుక ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం గ్రంధాలయానికి వచ్చి చదువుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠకులు వెంకటేశ్వర్లు ,రవి, పరమేష్, వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News