ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ని హైదరాబాద్ లో ప్రపంచ రికార్డు గ్రహీత, ప్రముఖ మైండ్ పవర్ ట్రెయినర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు రచయిత టి.వేణుగోపాల్ రెడ్డి ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గంలోని, విద్యార్థులు, యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహించాల్సిన ప్రత్యేక శిక్షణ తరగతుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అనంతరం, తాను రచించిన పలు స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖర రెడ్డికి వేణుగోపాల్ రెడ్డి బహుకరించారు.
Admin
E Nivas News